ఆరోగ్య సేతు యాప్‌పై WHO ప్రశంసలు..
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసలు కురిపించింది. కొవిడ్ క్లస్టర్లను గుర్తించడంలో ఈ యాప్ చాలా సహాయపడిందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. దీని వాడకం ద్వారా ఆరోగ్య శాఖ ఆయా ప్రాంతాల్లో కరోనా టెస్టులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వీలు చిక్కిందన్నారు. అధనామ్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి ప్రైమరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేయడం, […]
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసలు కురిపించింది. కొవిడ్ క్లస్టర్లను గుర్తించడంలో ఈ యాప్ చాలా సహాయపడిందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. దీని వాడకం ద్వారా ఆరోగ్య శాఖ ఆయా ప్రాంతాల్లో కరోనా టెస్టులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వీలు చిక్కిందన్నారు.
అధనామ్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి ప్రైమరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేయడం, సెల్ఫ్ ఐసొలేషన్‌లను పర్యవేక్షించడానికి ఉపకరించే సాధనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవరసమున్నదని అభిప్రాయపడ్డారు. మొబైల్ అప్లికేషన్ లాంటి టెక్నాలజీ ఈ పనిని సమర్థంగా నిర్వహిస్తున్నాయన్నారు. రూ.15 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఆరోగ్య సేతు యాప్ ఈ కోవకే చెందుతుందని చెప్పారు.
ఏయే ప్రాంతాలు కరోనా క్లస్టర్లుగా మారే ముప్పు ఉన్నదన్న విషయాన్ని అధికారులు ముందుగానే తెలుసుకోవడానికి ఈ యాప్ ఎంతో సహాయపడిందన్నారు. తద్వారా ఆయా ఏరియాల్లో కరోనా టెస్టులు పెంచే ప్రణాళికలు చేశారని గుర్తుచేశారు. కరోనా రోగి తమ వద్దకు రాగానే యూజర్లను అలర్ట్ చేసే ఆరోగ్య సేతు యాప్‌ను కేంద్రం ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాదు, కరోనాబారిన పడే ముప్పు అంచనాను యూజర్లకు ఈ యాప్ ఇస్తున్నది.