Kishan Reddy : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై అదివారం ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై అదివారం ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిపించింది ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకులే అని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సినీ పరిశ్రమ మీద కక్ష కట్టారని, కళాకారులను బాధ పెట్టడం తగదని కిషన్ రెడ్డి సూచించారు. తనపై జరుగుతున్న అబద్దపు ప్రచారం గురించి ప్రజలకు నిజాలు తెలియజేయడంలో అల్లు అర్జున్ తప్పేమిటని.. నిజాలు బయటికి వచ్చేసరికి కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని, అందుకే ఆయన ఇంటిపై దాడి చేయించారని పేర్కొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు కరువయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకో ఘటన జరుగుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede)లో చనిపోయిన రేవతి(Revathi) కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థి నాయకులు రాళ్ల దాడికి దిగారు. ఫ్లకార్డ్సుతో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు. ఆ తర్వాత నిరసన కారుల్లో కొందరు ఒక్కసారిగా అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.