కాకా మా అందరికీ స్ఫూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) 10వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దిశ,రాంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) 10వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాగర్ పార్క్ లోని కాకా విగ్రహం కు నివాళులు అర్పించిన అనంతరం పెద్దలు కాకా నెలకొల్పిన డా . బి. ఆర్. అంబేద్కర్ విద్యా సంస్థలకు చేరుకుని నివాళులు ఘటించారు. అంబేద్కర్ విద్యా సంస్థలో నిర్వహించి పూర్వ విద్యార్థి సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ నీటిపారుదల, ఆహారం & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవ అతిథి తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరైనారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… దివంగత కాకా మా అందరికీ స్ఫూర్తి అన్నారు. కాకా జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వెంకటస్వామి చేయని పదవీ లేదు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారని అన్నారు. దివంగత కాకా మా అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. ఎంతో మంది పేదలకు మంచి విద్యనందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ , డిబిఆర్ఏఈఐ చైర్మన్, కార్యదర్శి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వెంకటస్వామి,వినోద్,డిబిఆర్ఏఈఐ కరస్పాండెంట్ గడ్డం సరోజ వివేక్ తదితరులు పాల్గొన్నారు.