CM Revanth Reddy : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై అదివారం ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే.

Update: 2024-12-22 16:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై అదివారం ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ(Telangana DGP), నగర పోలీసు కమిషనర్(CP) ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని సీరియస్ అయ్యారు. అదేవిధంగా సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.

అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede)లో చనిపోయిన రేవతి(Revathi) కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థి నాయకులు రాళ్ల దాడికి దిగారు. ఫ్లకార్డ్సుతో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు. ఆ తర్వాత నిరసన కారుల్లో కొందరు ఒక్కసారిగా అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Tags:    

Similar News