Konda Surekha: కాంగ్రెస్ పాలనలో విద్య, వైద్య రంగాలకు ఆగ్రస్థానం.. మంత్రి కొండా సురేఖ
పీవీ నర్సింహారావు(PV Narsimha Rao) ఆశయాల మేరకు ప్రజాసంక్షేమాన్ని కోరి విద్య(Education), వైద్య(Medical) రంగాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అగ్రస్థానం కల్పిస్తుందని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పీవీ నర్సింహారావు(PV Narsimha Rao) ఆశయాల మేరకు ప్రజాసంక్షేమాన్ని కోరి విద్య(Education), వైద్య(Medical) రంగాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అగ్రస్థానం కల్పిస్తుందని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తెలిపారు. పీవీని మించిన మేధోసంపన్నుడు, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు మరొకరు లేరని అన్నారు. ఈ నెల 23న పీవీ నర్సింహారావు 20వ వర్ధంతిని పురస్కరించుకొని, దేశానికి పీవీకి అందించిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డ అయిన పీవీ నర్సింహారావు దేశ ప్రధానిగా సేవలందించడం మనందరికీ గర్వకారణమన్నారు. రక్షణ, విదేశాంగ, హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పీవీ నర్సింహారావు అమలు చేసిన విధానాలు, సంస్కరణలు దేశాన్ని మేలి మలుపు తిప్పాయని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి, విశ్వవిపణికి భారతదేశాన్ని అనుసంధానం చేసి, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ ఖ్యాతిగడించారని కొనియాడారు. రాజకీయ వ్యవస్థ కన్నా దేశం గొప్పదనే పీవీ మాటలు సదా ఆచరణీయమైనవని పేర్కొన్నారు.