జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగి అస్వస్థతకు గురైన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది...

Update: 2024-12-23 04:23 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా పరవాడ మండలంలో ప్రమాదం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ(Jawaharlal Nehru Pharmacy) రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌(Rakshitha Drugs Private Limited)లో విషవాయువులు (Poisonous Gases) లీకయ్యాయి. దీంతో నలుగురు కార్మికులు అస్వస్థత గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గాజువాక‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News