రైతులకు గుడ్ న్యూస్...48 గంటల్లోపే ధాన్యం డబ్బులు

ఐదేళ్లపాటు రైతులకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పని చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు...

Update: 2024-12-23 07:53 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐదేళ్లపాటు రైతులకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం(YCP Govt) పని చేసిందని, రాయితీలు లేక, ఎరువులు అందక, సూక్ష్మ సేద్యం, యంత్ర పరికరాలు దూరమై అన్నదాతలు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Achennaidu) అన్నారు. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు సూక్ష్మ సేద్యం అమలుకు మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రాయితీపై డ్రిప్ సామాగ్రి అందించామన్నారు. సహకార సంఘాల్లో రైతులకు ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని మంత్రి అచ్చెన్న చెప్పారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 గంటలలోపే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. భూసార పరీక్షలు - భూసార పరీక్షా ఫలితాల పత్రాలు జారీ చేయడంతో పాటు పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), డిజిటల్‌ వ్యవసాయం - ఈ-పంట, డి-కృషి యాప్‌ & పెస్ట్ & డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్, డ్రోన్‌ గ్రూపులను ఏర్పాటు చేశామని తెలిపారు. కౌలుదారు సాగుహక్కు పత్రాల జారీ- ఆంధ్రప్రదేశ్‌ కొత్త కౌలు చట్టం, 2024 వంటి నూతన సంస్కరణలతో రైతులకు మేలు చేకూర్చే కార్యక్రమాలు చేపడుతున్నామని, రైతు ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

Tags:    

Similar News