ఎవరబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
బెనిఫిట్ షో ప్రదర్శనలపై ఏపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు....
దిశ, వెబ్ డెస్క్: బెనిఫిట్ షో(Benefit show) ప్రదర్శనలపై ఏపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ(AP MLA Bandaru Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ పుష్పా-2 మూవీ(Allu Arjun Pushpa-2 Movie) తొక్కిసలాట ఘటన తెలంగాణ(Telangana)లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ సినీ ఇండస్ర్టీపై మండిపడ్డారు. బెనిఫిట్ షోలపై నియంత్రణ ఉండాలని, లేని కారణంగా తొక్కిసలాటలు జరుగుతున్నాయన్నారు. సినిమా వాళ్లకు లబ్ధి చేకూరేలా బెనిఫిట్ షోలు వేస్తున్నారని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు బెనిఫిట్ షోలు ఎవరి కోసం వేస్తున్నారో సినీ ప్రముఖులను చెప్పాలన్నారు. విపత్తులు, సినీ కార్మికుల కోసం బెనిఫిట్ షోలు ప్రారంభించారని, ఇప్పుడు దాన్ని వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఎవరబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారని నిలదీశారు. బెనిఫిట్ షోలు ప్రదర్శించి ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.