No Detention Policy : నో డిటెన్షన్ విధానం రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-23 11:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థుల నో డిటెన్షన్ విధానం(No Detention Policy) రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు 5వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కాని ఇకపై 5 నుంచి 8 వార తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ఆయా తరగతులు ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు రెండు నెలల్లో మళ్ళీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం -2019కి చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి. అయితే పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలో ఉండటం వలన ఈ విషయంలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానం కొనసాగుతోంది. 

Tags:    

Similar News