BGT 2024 : పాత పిచ్‌లపై భారత్ ప్రాక్టీస్.. ఎంసీజీ పిచ్ క్యూరేటర్ క్లారిటీ ఇదే..!
బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నాలుగో టెస్ట్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నాలుగో టెస్ట్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత్ ప్రాక్టీస్ సందర్భంగా వాడిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేసింది. ఆస్ట్రేలియా మాత్రం ఫ్రెష్ పిచ్‌లపై సాధన చేసింది. ఇదే అంశంపై పిచ్ క్యూరేటర్ మ్యాట్ పేజ్ సోమవారం స్పందించారు. ‘మూడు రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ కోసం పిచ్‌లను సిద్ధం చేశాం. అంతకు ముందే భారత జట్టు వచ్చి ఉన్న పిచ్‌లపై ప్రాక్టీస్ చేసింది. సోమవారమే భారత్ ఇక్కడికి వచ్చి ఉంటే ఫ్రెష్ పిచ్‌లపై సాధన చేసేది. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. పిచ్ పరిస్థితిపై సంతృప్తిగా ఉన్నాం. గత రెండేళ్లుగా ఈ పిచ్‌ను ఆయా మ్యాచ్‌లకు తయారు చేశాం. పిచ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మైదానంలో మరింత గడ్డిని పెంచాం. దీంతో బౌలర్లకు మంచి పోటీ వాతావరణం ఉంటుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో బౌలర్లు రాణిస్తారు.’ అని పేజ్ అన్నాడు.