రేషన్ బియ్యం మిస్సింగ్.. పేర్ని నానికి మరోసారి నోటీసులు
రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశార..
దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం(Ration rice) మిస్సింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన భార్యపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam)లో పేర్ని నానికి చెందిన గోదాములో టన్నుల కొద్ది రేషన్ బియ్యం మాయం అయింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perni Nani)తో పాటు ఆయన భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజాపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లడంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు.అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నోటీసులను ఇంటికి అంటించారు. వారి కోసం గాలిస్తున్నారు.
అయితే ఈ కేసుపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్(Krishna District SP Gangadhar) తాజాగా మాట్లాడుతూ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానికి మరోసారి నోటీసులు ఇస్తామని తెలిపారు. రేషన్ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదుచేశామని, లోతైన విచారణ జరుగుతోందని చెప్పారు. రికార్డులతో పాటు సీపీయూ సీజ్ చేసి FSLకు పంపామన్నారు. త్వరలోనే కేసు విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. కేసు విచారణపై అపోహలు అవసరంలేదని ఎస్పీ గంగాధర్ పేర్కొన్నారు.