Ap News:బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి హామీ.. తక్షణమే అమలు చేసిన జిల్లా కలెక్టర్
పెనమలూరు మండలం గోశాల పంచాయతీ పరిధి వైకుంటపురం గ్రామానికి చెందిన గొట్టుపల్లి నాగరాజు, రాజేశ్వరి దంపతులకు 3 సంవత్సరాల వయస్సు గల రెండో కుమార్తె తనయ కిడ్నీ
దిశ కృష్ణాజిల్లా, ప్రతినిధి: పెనమలూరు మండలం గోశాల పంచాయతీ పరిధి వైకుంటపురం గ్రామానికి చెందిన గొట్టుపల్లి నాగరాజు, రాజేశ్వరి దంపతులకు 3 సంవత్సరాల వయస్సు గల రెండో కుమార్తె తనయ కిడ్నీ, లివర్ సంబంధిత తీవ్ర జెనెటిక్ అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా, శుక్రవారం ఈడుపుగల్లులో జరిగిన రెవెన్యూ సదస్సు సమావేశంలో ఈ దంపతులు ముఖ్యమంత్రిని కలిసి తమ పాపను ఆదుకోవాలని కోరగా ముఖ్యమంత్రి హామీ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం కలెక్టరేట్లో పాప వైద్యం కోసం రూ.2 లక్షల రూపాయల చెక్ పాప తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా దంపతులు తమ కుమార్తెకు ప్రత్యేక వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం ద్వారా పింఛన్లు మంజూరు చేయించాలని కలెక్టర్ ను కోరగా, వీరితో దరఖాస్తు చేయించాలని కలెక్టర్ తమ వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. పాపకు కిడ్నీ, లివర్ సంబంధిత జెనెటిక్ ఆరోగ్య సమస్య కారణంగా 3 సంవత్సరాల నుండి ఎదుగుదల లేక తమ కుమార్తె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నెల మందులు, వైద్యానికి 10 వేల రూపాయలు వ్యయం అవుతున్నదని, ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పాప తల్లిదండ్రులు తెలిపారు.