రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఫోకస్.. త్వరలో కీలక ప్రకటన

రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది...

Update: 2024-12-20 09:20 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రుషికొండ భవనాల(Visakha Rushikonda Buildings)పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎంతో విలాసవంతంగా ఈ నిర్మాణాలను గత ప్రభుత్వం చేపట్టింది. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ భవనాల నుంచే పాలన సాగించాలని అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YCP chief Jagan Mohan Reddy) భావించారు. విశాఖ నుంచి పాలన సాగిస్తామని ఎన్నికలకు ముందు తెలిపారు. అయితే రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలుకావడంతో ఈ భవనాల వినియోగం సస్పెన్స్‌గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ భవనాలను సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. అయినా ఈ భవనాలు ఎలా వినియోగిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ప్రస్తుతం రుషికొండ భవనాలపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించనుంది. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) వెల్లడించారు. తెలుగు భాష(Telugu language) ఔన్యత్య కోసం కృషి చేసిన చిన్నయ్య సూరి(Chinnayya Suri) పేరిట సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రుషికొండ భవనాల వినియోగంపై స్పందించారు. రాష్ట్రంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. టూరిజం రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, విజయవాడ(Vijayawada)లో పెట్టుబడిదారులతో సందస్సు నిర్వహించబోతున్నామని తెలిపారు. విశాఖపట్నం(Visakhapatnam) పర్యటక రంగంలో పెట్టేందుకు చాలా ఔత్సాహితులు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక శాఖ ఉత్సవాలు నిర్వహిస్తామని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News