Pawan Kalyan: నేను మీసం తిప్పితే.. మన్యంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్

మన్యం జిల్లా అంటే తిరుగుబాటును, భాషను నేర్పించిన నేల.. యువత సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టడం కాదు..

Update: 2024-12-20 12:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘‘మన్యం జిల్లా అంటే తిరుగుబాటును, భాషను నేర్పించిన నేల.. యువత సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టడం కాదు.. మీ జీవితాల మీద దృష్టి పెట్టండి’’ అంటూ యువతకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్వతీపురంలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఓజీ.. ఓజీ అని అరవకండి.. నన్ను పని చేసుకోనివ్వండి అంటూ కాస్తా సీరియస్ అయ్యారు. మాట్లాడితే అన్నా మీసం తిప్పు.. మీసం తిప్పు అంటుంటారు. నేను మీసం తెప్పితే రోడ్ల పడుతాయా..? చాతీ మీద కొట్టుకుంటే రోడ్లు పడతాయా..? నేను ప్రధాని, ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చెబితే రోడ్లు పడతాయి.. అందుకే నన్ను పని చేసుకోనివ్వండి. ఇంకో విషయం.. నేను ఏపీకి డిప్యూటీ సీఎంను. కానీ సీఎం సీఎం అంటూ అరుస్తున్నారు.. ఇది సరైంది కాదు అంటూ అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News