TDP: ఏపీ రైతును అగ్ర స్థానంలో నిలుపుతాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రైతులను(Andhra Pradesh Farmers) అగ్రస్థానంలో(Top Position) నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) అన్నారు.

Update: 2024-12-20 14:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రైతులను(Andhra Pradesh Farmers) అగ్రస్థానంలో(Top Position) నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) అన్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఈడ్పుగల్లు రెవెన్యూ సదస్సులో(Eidpugallu Revenue Conference) పాల్గొన్న అనంతరం గంగూరులో(Gangur) ధాన్యం సేకరణను(Grain Procurement) పరిశీలించారు. ఈ పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ తీరును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించానని, కృష్ణా జిల్లా గంగూరులో రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ విధానం పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు.

అలాగే అన్నదాతలకు మరింత లబ్ది చేకూర్చడానికి ఏం చేయాలి అనే అంశాలపై వారితో మాట్లాడానని, నా ఆలోచనలు కూడా వారితో పంచుకొని, వారి సూచనలు తీసుకున్నానని తెలిపారు. అంతేగాక మన బలం వ్యవసాయం అని, దాన్ని మరింత బలోపేతం చేస్తామని, అన్నదాతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాంకేతికతను చేరువ చేసి రైతులకు సాగు ఖర్చులు తగ్గిస్తామని, ఆధునిక వ్యవసాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నదాతను అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ సీజన్ లో ధాన్యం సేకరణ విధానాలు మార్చి, నిబంధనలు సరళతరం చేసి ఖరీఫ్ లో ఇప్పటివరకు 19 లక్షల 90 వేల 945 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ జరిపామని, 3 లక్షల మంది రైతులకు రూ. 4,584 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బును 48 గంటల్లో చెల్లించామని చెప్పేందుకు సంతోషిస్తున్నానని చంద్రబాబు రాసుకొచ్చారు.

Tags:    

Similar News