Vijayawada: ప్రాణం తీసిన డాక్టర్ నిర్లక్ష్యం.. మృతుని బంధువుల ఆందోళన

డాక్లర్ల నిర్లక్ష్యం(Doctor's Neglegence) కారణంగా ఓ వ్యక్తి మృతి(Died) చెందిన ఘటన విజయవాడ(Vijayawada)లో జరిగింది.

Update: 2024-12-22 09:27 GMT

దిశ, వెబ్ డెస్క్: డాక్లర్ల నిర్లక్ష్యం(Doctor's Neglegence) కారణంగా ఓ వ్యక్తి మృతి(Died) చెందిన ఘటన విజయవాడ(Vijayawada)లో జరిగింది. వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు(Enikepadu)లోని అను హాస్పిటల్స్(Anu Hospitals) అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. డైలీ చెకప్ లో భాగంగా డ్యూటీ డాక్టర్ మందులు రాసి ఇవ్వడంతో అదే హాస్పిటల్ కు చెందిన ఫార్మసీలో కొనుగోలు చేశారు. అయితే ఫార్మసీ సిబ్బంది డాక్టర్ రాసిన ఇంజక్షన్ కు బదులుగా వేరే ఇంజక్షన్ ఇచ్చాడు. డ్యూటీ డాక్టర్ ఇది గమణించకుండా నిర్లక్ష్య పూరితంగా ఇంజక్షన్ చేయడంతో వ్యక్తి మృతి చెందాడు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే గాక, బ్యాలెన్స్ ఇస్తేనే డెడ్ బాడీ ఇస్తామని చెప్పారు. దీంతో మృతుని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News