హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవం.. యువకుడిపై కేసు, అధికారిణిపై వేటు

గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లో దారుణం జరిగింది..

Update: 2024-12-22 14:37 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ(Guntur Social Welfare Department) హాస్టల్‌లో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని(Pharmacy student) ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తోటి ఫార్మసీ విద్యార్థిని సహకారంతో హాస్టల్‌లోనే ప్రసవించారు. అధిక రక్తస్రావం కావడంతో విద్యార్థినిని ప్రభుత్వం ఆస్పతికి తరలించారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ నాగలక్ష్మి(Collector Nagalakshmi) సీరియస్ అయ్యారు. గుంటూరు సంక్షేమ శాఖ అధికారిణి జయప్రదను సస్పెండ్‌ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అంతేకాదు కమిటీని సైతం నియమించారు. విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు. 9 నెలల పాటు గర్భంతో ఉన్నా హాస్టల్ సిబ్బంది కనిపెట్టలేకపోవడంపై మండిపడ్డారు. 

Tags:    

Similar News