Open 10th,Inter: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు చివరి తేదిదే..!
ఓపెన్ టెన్త్(Open Tenth), ఇంటర్(Inter) పరీక్షలు రాసే అభ్యర్థులకు బిగ్ అలర్ట్.
దిశ,వెబ్‌డెస్క్: ఓపెన్ టెన్త్(Open Tenth), ఇంటర్(Inter) పరీక్షలు రాసే అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు(Exam Fee) తేదీ వివరాలను ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ (AP Open School) సొసైటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు రేపటి నుంచి ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. టెన్త్‌లో సబ్జెక్టుకు రూ.5తో పాటు ఎగ్జామ్ ఫీజు రూ.95, ఇంటర్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు పరీక్ష ఫీజు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. సబ్జెక్టుకు రూ.25 ఫైన్‌తో జనవరి 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 8వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తమ దగ్గర్లోని ఏపీ ఆన్ లైన్ సేవా కేంద్రం లేదా అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ ద్వారా ఫీజు పే చేయాలని సూచించారు. కాగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి నెలలో జరగనున్నాయి.