Shocking incident:స్క్రీన్ మీద ‘పుష్ప-2’ మూవీ.. థియేటర్లో నిందితుడి అరెస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2 ది రూల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Update: 2024-12-22 14:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2 ది రూల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. పుష్ప-2 మూవీ చూస్తోన్న ప్రేక్షకులకు షాకింగ్ ఘటన ఎదురైంది. అసలు విషయంలోకి వెళితే.. నాగ్‌పూర్‌లోని ఓ థియేటర్‌లో పుష్ప-2 సెకండ్ షో నడుస్తోంది.

స్క్రీన్‌కి అతుక్కుపోయి ఉన్న ప్రేక్షకులు థియేటర్‌లోకి పోలీసులు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఆందోళన చెందొద్దని ఆడియన్స్‌కి చెప్పిన వారు ఓ నిందితుడిని జల్లెడపట్టి పట్టుకున్నారు. ఇటీవల విడుదలైన చిత్రం పట్ల అతని ఆసక్తి గురించి తెలుసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. చివరికి ట్రాక్ చేయబడ్డారని పచ్‌పోలీ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి ఆదివారం తెలిపారు. విశాల్ మేస్రం పై రెండు హత్యలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణా తో సహా 27 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 10నెలలుగా తప్పించుకు తిరుగుతుండగా చివరకి థియేటర్‌లో పట్టుబడ్డాడు. రీల్-రీయల్ సీన్స్ ఒకే చోట జరిగాయి.


Also Read ...

Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికి భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు 

Tags:    

Similar News