దిశ, వెబ్ డెస్క్: జనవరి 2న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రతి నెల మొదటి, మూడో గురువారాలు కేబినెట్ భేటీ కావాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 2న కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదలనపై కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రి నారా లోకేశ్, మిగిలిన మంత్రులు కూడా పాల్గొన్నారు.