బలహీనపడిన వాయుగుండం... ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ఉత్తరాంధ్రలో రెండు రోజుల్లో భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ...

Update: 2024-12-22 13:35 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్రలో రెండు రోజుల్లో భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం(Bay of Bengal)లో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో  ఏపీ(Ap) ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో తాజాగా వాయుగుండం బలహీన పడిందని, రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో మరో రెండు రోజుల్లో భారీగా వర్షాలు(Heavy Rains) కురుస్తామని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని హెచ్చరించారు. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, గొర్రెలకాపరులకు చెట్ల కిందకు వెళ్లొద్దని తెలిపారు. మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News