CM Chandrababu: అమెరికా టారిఫ్ లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమెరికా టారిఫ్ లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని అప్పు ఇచ్చేవాళ్లు కనిపించడం లేదని సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి జంప్ అయ్యిందని విమర్శించారు. ఇవాళ ఎన్డీఆర్ జిల్లా ముప్పాళ్లలో (NTR District Muppalla) సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం పీ-4 కార్యక్రమం కింద ఎంపికైన వారిని సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని సంపద సృష్టించి ఆ సంపదను పేదలకు పంచుతామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి చేయాలని అన్నారు. పేదల సేవలో భాగంగా ఒకటో తేదీనే పించన్లు ఇస్తున్నామని స్వయం ఉపాధి కింద అనేక పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు.
టార్గెట్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ:
నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే జాతి బాగుపడుతుందని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ నా లక్ష్యం అని సీఎం చెప్పారు. దేశంలో పుట్టిన ఏ వ్యక్తీ పేదరికంలో ఉండటానికి వీళ్లేదని ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్నారు. అట్టడుగున ఉన్నవారికి చేయుత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారు. ఇప్పుడూ పీ4 అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు సూపర్ -6 హామీలు అమలు చేస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం అందజేస్తామని సీఎం మాటిచ్చారు. దీపం-2 కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగ ఇస్తున్నామని చెప్పారు. తలసరి ఆదాయం పేరగాలని 2047 నాటికి భారత్ అగ్రస్థానంలో ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా టారిఫ్ లతో ఏపీకి దెబ్బ:
అన్ని వర్గాల వారు బాగుండాలి అందరికీ న్యాయం జరగాలని చంద్రబాబు అన్నారు. మీలో ఆలోచన విధానం మారాలని తప్పుచేసిన వారిని తప్పు అని, మంచి చేసిన వారికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి రావాలన్నారు. గత ప్రభుత్వంలో SC లకు సంభందించి 27 కార్యక్రమాలు రద్దు చేసిందని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు మీ గ్రామాలకు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు. పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయన్నారు. స్కూల్స్ మేగా పేరెంట్స్ డే కింద నాణ్యమైన విద్య అందజేస్తామన్నారు. నేను ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తుంటే వైసీపీ రావడం వాటిని పాడుచేయడం నేను అధికారంలోకి వచ్చాక వాటిని పాడు చేయడమే కాకుండా పంపులు, స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారని విమర్శించారు. వేదాద్రి-కంచల ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. సుబాబులకు రేట్లు రావాలి. దీనిపై సమీక్ష చేస్తానన్నారు.అమెరికా టారిఫ్ ల (American Tariffs) వల్ల ఏపీ అక్వాకల్చర్ (Aqua Culture) దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీని ఎలా ఎదుర్కోవాలో ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటామన్నారు.