ఏపీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-12-23 07:41 GMT

దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ(Telugu film industry) పై కక్ష గట్టిందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నేతలో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కి తరలి వస్తే.. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఏపీకి వెళ్తుందనే వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపై ప్రముఖ నిర్మాత నాగవంశీ(Producer Nagavanshi) క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు. నేనిక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నారు.. ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తా అని ప్రశ్నించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో త్వరలో టాలీవుడ్ మీటింగ్ ఉంటుదనే విషయం నాకు తెలియదు అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.


Similar News