Seethakka: పుష్ప-2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

పుష్ప సినిమా(Pushpa Movie)పై మంత్రి సీతక్క(Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-23 10:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప సినిమా(Pushpa Movie)పై మంత్రి సీతక్క(Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జైభీమ్(Jai Bhim Movie) లాంటి సినిమాలకు అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సినిమాకు ప్రోత్సహకాలు కూడా లేవని అన్నారు. ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు విప్పించి నిల్చోబెడితే జాతీయ అవార్డులు ఇస్తున్నారు. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు. స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసులు, లాయర్లను విలన్‌లను చేశారని మండిపడ్డారు. రెండు హత్యలు చేసిన నిందితుడు మహారాష్ట్రలో పుష్ప-2 సినిమా చూస్తూ దొరికాడు. ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా తయారు చేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా సినిమాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు తమదైన శైలిలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

Tags:    

Similar News