BRS సోషల్ మీడియా యాక్టివిస్టులపై BJP సీరియస్
బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు(BRS Social Media Activists)లపై తెలంగాణ BJP అధిష్టానం సీరియస్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు(BRS Social Media Activists)లపై తెలంగాణ BJP అధిష్టానం సీరియస్ అయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసు(Cybercrime Police)లకు ఫిర్యాదు చేసింది. తప్పుడు పోస్టులతో ప్రజలను బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. సోషల్ మీడియా పోస్టుల(Social Media Posts)పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బీజేపీ(BJP) పేర్కొన్నది.
ఇదిలా ఉండగా.. కేసీఆర్(KCR)కు బీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఇటీవల బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కేసీఆర్ మనుషులు బీదర్‌లో దొంగనోట్లు ముద్రిస్తున్నారు.. ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేసేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు సైతం ప్రయత్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆగిపోయారు. ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ నేతలు ఆ దొంగ నోట్లే పంచారని బండి సంజయ్ ఆరోపించారు.
బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. బండి సంజయ్ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎంపీ అవకముందు ఎంత ఆస్తి ఉండే.. ఎంపీ అయ్యాక ఎంత ఆస్తి పెరిగిందో చూడండి అంటూ విస్తృతంగా పోస్టులు పెట్టారు. దీంతో బండి సంజయ్‌ను పర్సనల్‌గా టార్గెట్ చేయడం పట్ల బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.