నా నియోజవర్గంలో ఉన్న వాటిపై చర్యలు తీసుకోండి.. సీఎంకు రాజాసింగ్ కీలక రిక్వెస్ట్

నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.

Update: 2025-03-26 17:04 GMT
నా నియోజవర్గంలో ఉన్న వాటిపై చర్యలు తీసుకోండి.. సీఎంకు రాజాసింగ్ కీలక రిక్వెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మున్సిపల్ శాఖ మంత్రి (Municipal Minister) చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) విజ్ఞప్తి చేశారు. భద్రాచలం ఘటన (Bhadrachalam Incident)పై ట్విట్టర్ వేదికగా వీడియో చేసిన ఆయన.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి (Curreption) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. భద్రాచలంలో అక్రమంగా కట్టిన ఐదు అంతస్తుల భవనం కూలిపోయిందని, దాని కింద పడి కొందరు వ్యక్తులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఒక్క భద్రాచలంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, గోషామహాల్ నియోజకవర్గం (Goshamahal Constiency)లో కూడా అక్రమ నిర్మాణాలు (Illegal Constructions) చాలా ఉన్నాయని అన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై తనతో పాటు కార్పోరేటర్లు, ప్రజలు ఎన్నో ఫిర్యాదులు చేశామని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. బిల్డర్లు తక్కవ ధరలకు స్థలాలు కొని, రెండు, మూడు ఫ్లోర్లకు అనుమతులు తీసుకొని, ఐదు నుంచి పది ఫ్లోర్లు నిర్మిస్తున్నారని అన్నారు. దీనిపై సీసీపీ సహా అధికారులందరికీ ఫిర్యాదు చేసినా ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదని చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కరప్షన్ కు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీసీపీ కింద ఉండే టౌన్ ప్లానింగ్ ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్లు సహా ఇతర అధికారులు అక్రమ నిర్మాణాల దగ్గరికి వెళ్లి లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని, ఇందులో సీసీపీకి కూడా కొంత వాటా కమిషన్ పోతుందని తాను అనుకుంటున్నానని అన్నారు. కోట్లలో డబ్బు తీసుకొని అధిక ఫ్లోర్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నారని, అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. లేదా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు కాబట్టే తాము ఇచ్చిన ఫిర్యాదులను చెత్త బుట్టలో పడేస్తున్నారని అన్నారు. ఇక హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (Hyderabad Municipal Coproration) పరిథిలో ఉన్న అందరూ అధికారులపై విచారణ చేపట్టాలని, అవినీతి చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా.. ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని రాజాసింగ్ అన్నారు. 

Tags:    

Similar News