Sai Pallavi: కాశీలోని అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న నేచురల్ బ్యూటీ.. ఫొటోలు వైరల్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-12-23 10:53 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది. అయితే ఈ భామ సినిమాల్లో బోల్డ్‌గా యాక్ట్ చేయకపోవడం, మినిమల్ మేకప్ వేసుకోవడంతో సాయి పల్లవిపై మరింత గౌరవం పెరిగిపోయింది. ఈమె డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్య సరసన ‘తండేల్’ మూవీతో పాటు రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో సాయి పల్లవి ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా సాయి పల్లవి కాశీలోని అన్నపూర్ణా దేవి ఆలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ పిక్స్‌లో సాయి పల్లవి బ్లూ సల్వార్ సూట్, దుపట్టా, మెడలో బంతి పూల హారం, చేతికి రుద్రాక్ష దండతో అన్నపూర్ణా దేవి అమ్మవారిని దర్శించుకుంది. సాయి పల్లవికి చెందిన ఓ ఫ్యాన్ క్లబ్ ఆమె కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.



 



Tags:    

Similar News