‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సెకెండ్ సింగిల్ మీ శీతాకాలం సరోజా సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. (పోస్ట్)

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi).

Update: 2024-12-23 12:51 GMT
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సెకెండ్ సింగిల్ మీ శీతాకాలం సరోజా సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. (పోస్ట్)
  • whatsapp icon

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్‌(Bharath)లు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. అయితే, తాజాగా ఇందులోంచి సెకెండ్ సింగిల్‌(Second Single) రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘టచ్‌లో ఉండూ మీ శీతాకాలం సరోజ’ అనే సాంగ్‌ డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌ను గమనించినట్లయితే ఈ పాట ఐటెమ్ సాంగ్ అన్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రముఖ రచయిత చంద్రబోస్(Chandra Bose) రాసిన ఈ పాటను రేలారే రేల రఘు(Relare Rela Raghu), లక్ష్మి దాస(Lakshmi Dasa) పాడగా.. శేఖర్ మాస్టర్(shekar Master) కొరియోగ్రఫీ అందించారు.


Read More..

Viral: మేడమ్ మంచి డాన్సరే.. "పీలింగ్స్​" పాటకు లేడీ ప్రొఫెసర్​ స్టెప్పులు!

Tags:    

Similar News