ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్ హీరోస్.. నా ఫేవరేట్ అంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-12-23 12:10 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి త్రిబుల్ ఆర్(RRR) సినిమాలో తమ నటనతో ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టేలా చేశారు. ఇక ఈ మూవీ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి కనపడలేదు. అయితే తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) ఎన్టీఆర్- రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ స్టార్స్‌తో దుబాయ్, గేమ్ ఛేంజర్’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. అయితే వీరంతా దుబాయ్‌లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు RRR సినిమా తర్వాత ఇన్ని రోజులకు సడెన్‌గా మీ ఇద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూడటం చాలా హ్యాపీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shanker) కాంబోలో రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌‌ జోరు పెంచేశారు. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ‘RC16’ అనే మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags:    

Similar News