Premikudu: నేలపై నగ్నంగా పడుకున్న హీరో.. వైరల్ అవుతున్న ఫొటో

బేస్డ్ లవ్ స్టోరీస్ (love stories) ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాయి.

Update: 2024-12-23 15:37 GMT

దిశ, సినిమా: బేస్డ్ లవ్ స్టోరీస్ (love stories) ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలోని సంఘర్షణ, ఎమోషన్స్ మీద తీసే చిత్రాలు ఎవర్గ్రీన్‌గా ఉంటాయి. ఈ జోనర్‌లోనే వస్తున్న తాజా చిత్రం ‘ప్రేమికుడు’ (Premikudu). ఈ సినిమా నేటి తరానికి, ట్రెండ్‌కి తగ్గట్టుగా సాగే ఓ రా అండ్ బోల్డ్ రొమాంటిక్ చిత్రం. రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండగా.. నోట్లో సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘అన్‌ఫిల్టర్డ్" అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.




 


Tags:    

Similar News