కడప సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత.. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే
కడప సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది...
దిశ, వెబ్ డెస్క్: కడప సర్వసభ్య సమావేశం(Kadapa Plenary Meeting) రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశం ఎమ్మె్ల్యే మాధవిరెడ్డి(Mla Madhavireddy) వర్సెస్ మేయర్ కె. సురేశ్ బాబు(Mayor K. Suresh Babu)గా మారింది. మేయర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వ సభ్య సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. అయితే ఆమెకు కుర్చీ వేయలేదు. దీంతో ఆమె నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దే నిలబడి మాధవి రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తనకు కుర్చే వేసేదాకా నిలబడే ఉంటానని ఎమ్మెల్యే పట్టుబట్టారు. గత ప్రభుత్వంలో ఎమ్మె్ల్యేకు కుర్చీ ఎలా వేశారని నిలదీశారు. దీంతో మేయర్ పోడియం దగ్గర టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అటు టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కడప సర్వసభ్య సమావేశంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.