Kadapa: జగన్ బాబాయ్ వైఎస్ మనోహర్‌రెడ్డిని విచారిస్తున్న పోలీసులు
జగన్ బాబాయ్ వైఎస్ మనోహర్‌రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు...
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి(YS Manohar Reddy)ని పోలీసులు విచారిస్తు్న్నారు. వివేకానందారెడ్డి హత్య కేసులో తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి(Krishna Reddy) ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో వైఎస్ సునీత(YS Sunitha), ఆయన భర్త రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy), అప్పటి ఎస్పీ రామ్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్‌తో పాటు మరో నలుగురిని విచారించారు. తాజాగా వైఎస్ మనోహర్ రెడ్డిని కడప డీఎస్పీ మురళీనాయక్ విచారిస్తున్నారు.
కాగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన పీఏ రాఘవరెడ్డిని కూడా విచారించారు. అయితే సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను బెదిరిస్తున్నారని పులివెందుల కోర్టులో రాఘవరెడ్డి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు వారిపై కేసులు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో వైఎస్ మనోహర్ రెడ్డిని తాజాగా పోలీసులు విచారిస్తున్నారు.