సొంత ఇలాకలో జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి ఏడుగురు కీలక నేతలు?
కడప కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి..
దిశ, వెబ్ డెస్క్: కడప కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం హయాంలో పూర్తి ఆధిక్యంతో నగర కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లలో 48 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలవగా.. టీడీపీ(Tdp), జనసేన(Janasena) ఒక్కో డివిజన్‌కే పరిమితమైంది. దీంతో కడప కార్పొరేషన్(Kadapa Corporation)లో వైసీపీ(Ycp) బలం కదిలించలేనంతగా పాతుకుపోయింది. అయితే రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. కడప నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ గెలవగా, పార్లమెంట్‌ను వైసీపీ కైవసం చేసుకుంది.
అయితే ప్రస్తుతం కడప కార్పొరేషన్ బీటలు వారుతోంది. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఓ కార్పొరేటర్ సైకిల్ ఎక్కారు. మరో ఏడుగురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కడప ఎంపీ అవినాశ్ రెడ్డి రంగంలోకి దిగారు. కార్పొరేటర్లను బుజ్జగిస్తున్నారు. వైసీపీ వీడి పోవద్దని కోరుతున్నారు. కానీ కార్పొరేటర్లు మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమక్షంలో సోమవారం చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.