ఈ బడిలో చదువుకోవాలంటే భయమేస్తోంది సార్!

వైఎస్‌ఆర్ జిల్లా(YSR District) ముద్దనూరు మండలంలోని కొర్రపాడులో స్కూల్ (School)పరిస్థితి దారుణంగా ఉంది.

Update: 2024-12-21 11:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: వైఎస్‌ఆర్ జిల్లా(YSR District) ముద్దనూరు మండలంలోని కొర్రపాడులో స్కూల్ (School)పరిస్థితి దారుణంగా ఉంది. బడికి వెళ్లాలంటే భయమేస్తోందంటూ చిన్నారులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..  అటూ ఇటూ ఒంటి ఇటుక గోడలు.. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయే ఇనుప రేకుల పై కప్పుతో ఉన్న ఆ బడిలో చదువుకోవాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. బలమైన గాలి వస్తే ఆ రేకులు ఎగిరి ఎక్కడ పడతాయో.. వానాకాలంలో తేళ్లు, జెర్రులు, ఎలుకలు వస్తుంటాయని అక్కడి చిన్నారులు భయం భయంగా తమ బాధను వెల్లడించిన వైనం హృదయాల్ని కదిలిస్తోంది. స్కూల్ బిల్డింగ్(School building) నిర్మాణ దశలోనే ఆగిపోయింది దాన్ని పూర్తి చేయాలని అక్కడి టీచర్లు స్థానికులు అధికారుల్ని కోరుతున్నారు.


Similar News