తెలుగోడి సత్తా పెంచాలని చూస్తుంటే.. లాగేయ్యాలని చూస్తున్నారు: అల్లు అర్జున్

పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో నేటికి హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-12-21 14:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2(పుష్ప-2) సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటన రాష్ట్రంలో నేటికి హాట్ టాపిక్ గా మారింది. ఇదే వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా ఇది జరిగిన గంటల వ్యవధిలోనే హీరో అల్లు అర్జున్(Allu Arjun) తన నివాసంలో ప్రెస్ మీట్(Press meet) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు. జరిగిన సంఘటనకు క్షమాపణలు(Apologies) చెబుతూ.. గాయాలతో ఆస్పత్రిలో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని నిత్యం కోరుకుంటున్నానని, ఇందులో భాగంగా.. తమ సినిమా భారీ హిట్ సాధించినప్పటికీ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎవరో కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఈ సినిమా కోసం మూడు సంవత్సరాల పాటు కష్టపడి పని చేశానని.. ఈ సినిమా చేస్తున్న ప్రతి సారి తాను.. తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలని చూశానని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తనను కిందకు లాగేయ్యాలని చూస్తున్నారంటూ హీరో అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో ఆయనతో పాటు తండ్రి అల్లు అరవింద్‌, న్యాయవాది అశోక్‌రెడ్డి ఉన్నారు.

Read More : నా క్యారెక్టర్ దిగజార్చే అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు : అల్లు అర్జున్

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన



Similar News