Allu Arjun : నా క్యారెక్టర్ దిగజార్చే అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు : అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అన్నారు.

Update: 2024-12-21 14:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్(Allu Arjun). నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంధ్య థియేటర్(Sandhya Theater) ఘటనపై అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ చనిపోయినా, ఆమె కుమారుడు ఆసుపత్రిలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని, అల్లు అర్జున్ ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. 'మంచి జరగాలనుకున్నా.. అనుకోని ప్రమాదం జరిగింది. ఇందులో ఎవరి తప్పూ లేదన్నారు. నేను ఎటువంటి రోడ్ షో నిర్వహించలేదని, పోలీసుల డైరెక్షన్ లోనే థియేటర్లోకి వెళ్లానని తెలిపారు. తాను లోపలికి వెళ్ళగానే బయట క్రౌడ్ ఎక్కువగా ఉందని పోలీసులు వచ్చి వెళ్లిపోండి అని చెప్పగానే, తాను తన కుటుంబ సభ్యులను తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయానని అన్నారు. తొక్కిసలాట గురించి తనకు తరువాతి రోజు ఉదయం తెలిసిందని.. ఒక మహిళ మృతి చెంది, ఆమె కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. తనపై కేసు ఉండటం వల్ల, న్యాయపరమైన చిక్కులు వస్తాయని మాత్రమే తను ఆసుపత్రికి వెళ్ళడం లేదని.. నేను అక్కడికి వెళ్లలేక పోయినా.. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, శ్రీతేజ ఆసుపత్రి ఖర్చులు అన్నీ తామే చూసుకుంటామని హామీ ఇచ్చామని వెల్లడించారు. తన క్యారెక్టర్ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, తనకూ కుటుంబం ఉందని.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. బయట తన గురించి జరుగుతున్నది అబద్దపు ప్రచారం అని, తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అల్లు అర్జున్ ఆవేదన చెందారు.   

తమ సినిమా భారీ హిట్ సాధించినప్పటికీ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎవరో కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఈ సినిమా కోసం మూడు సంవత్సరాల పాటు కష్టపడి పని చేశానని.. ఈ సినిమా చేస్తున్న ప్రతి సారి తాను.. తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలని చూశానని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తనను కిందకు లాగేయ్యాలని చూస్తున్నారంటూ హీరో అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో ఆయనతో పాటు తండ్రి అల్లు అరవింద్‌, న్యాయవాది అశోక్‌రెడ్డి ఉన్నారు.

Read More: తెలుగోడి సత్తా పెంచాలని చూస్తుంటే.. లాగేయ్యాలని చూస్తున్నారు: అల్లు అర్జున్

Tags:    

Similar News