ED: ‘ఫార్ములా ఈ-రేస్’‌ కేసులో ఈడీ దూకుడు.. ఏసీబీ నుంచి డేటా సేకరణ!

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణపై ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Update: 2024-12-22 02:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ రేస్ కేసు విచారణపై ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏసీబీ నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పొందుపర్చిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడ్డారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లావాదేవిలపై శనివారం విచారణ చేసినట్లు సమాచారం. ఏసీబీ ఆఫీసర్ల నుంచి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్ స్టేట్‌మెంట్ తీసుకొని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఫెమా ఉల్లంఘలకు పాల్పడి జరిగిన బ్యాంకు లావాదేవిలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు గల కారణాలను ఈడీ అధికారులు అన్వేశిస్తున్నారు. 8వ సీజన్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని అందు వల్లే వేరే దేశాల్లో జరగాల్సిన రేస్ హైదరాబాద్‌కు వచ్చిందనే ఆరోపణలపైనా విచారణ చేస్తున్నారు.

ప్రమోటర్ ఉన్న కంపెనీ తప్పుకోవడంపై విచారణ

ఫార్ములా ఈ రేస్‌లో త్రైపాక్షిక భాగస్వామం ఎందుకు రద్దయిందని, ప్రమోటర్ ఉన్న కంపెనీ ఎందుకు తప్పుకున్నదనే దానిపై ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. అనివార్య కారణలతో తప్పుకుందా లేక ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై విచారిస్తున్నారు. 9వ సీజన్ విజయవంతంగా జరిగితే 10వ సీజన్‌లో భాగస్వామిగా ఉన్న కంపెనీ అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకుంటుందనే దానిపైనా ఆరా తీస్తున్నారు. 11, 12 సీజన్లు సైతం హైదరాబాద్‌లో జరిగేలా కుదుర్చుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తున్నారు. 9వ సీజన్ ద్వారా హైదరాబాద్‌లో రూ.700 కోట్ల వ్యాపార లావాదేవిలు జరిగాయని, రూ.110 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని చెబుతున్న దానిపై ఈడీ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు.

హెచ్ఎండీఏ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

అగ్రిమెంట్ జరగకుండానే డబ్బు బదిలీ చేశారని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన అంశంపై ఈడీ అధికారులు హెచ్ఎండీఏ ఆఫీసర్ల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో లావాదేవీలు జరిపారన్న ప్రాథమిక అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు.ఫార్ములా ఈ రేస్ కేసు విచారణపై ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏసీబీ నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పొందుపర్చిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడ్డారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లావాదేవిలపై శనివారం విచారణ చేసినట్లు సమాచారం. ఏసీబీ ఆఫీసర్ల నుంచి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్ స్టేట్‌మెంట్ తీసుకొని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఫెమా ఉల్లంఘలకు పాల్పడి జరిగిన బ్యాంకు లావాదేవిలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు గల కారణాలను ఈడీ అధికారులు అన్వేశిస్తున్నారు. 8వ సీజన్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని అందు వల్లే వేరే దేశాల్లో జరగాల్సిన రేస్ హైదరాబాద్‌కు వచ్చిందనే ఆరోపణలపైనా విచారణ చేస్తున్నారు.

ప్రమోటర్ ఉన్న కంపెనీ తప్పుకోవడంపై విచారణ

ఫార్ములా ఈ రేస్‌లో త్రైపాక్షిక భాగస్వామం ఎందుకు రద్దయిందని, ప్రమోటర్ ఉన్న కంపెనీ ఎందుకు తప్పుకున్నదనే దానిపై ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. అనివార్య కారణలతో తప్పుకుందా లేక ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై విచారిస్తున్నారు. 9వ సీజన్ విజయవంతంగా జరిగితే 10వ సీజన్‌లో భాగస్వామిగా ఉన్న కంపెనీ అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకుంటుందనే దానిపైనా ఆరా తీస్తున్నారు. 11, 12 సీజన్లు సైతం హైదరాబాద్‌లో జరిగేలా కుదుర్చుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తున్నారు. 9వ సీజన్ ద్వారా హైదరాబాద్‌లో రూ.700 కోట్ల వ్యాపార లావాదేవిలు జరిగాయని, రూ.110 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని చెబుతున్న దానిపై ఈడీ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు.

హెచ్ఎండీఏ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

అగ్రిమెంట్ జరగకుండానే డబ్బు బదిలీ చేశారని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన అంశంపై ఈడీ అధికారులు హెచ్ఎండీఏ ఆఫీసర్ల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో లావాదేవీలు జరిపారన్న ప్రాథమిక అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు.

Tags:    

Similar News