Errabelli: అల్లు అర్జున్‌పై కేసు పెట్టి ఇబ్బంది పెడుతుండ్రు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్

సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-22 07:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ అయి బెయిల్‌ (Bail)పై జైలు నుంచి బయటకు వచ్చారు. తాజాగా, అసెంబ్లీ (Assembly) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Former Minister Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలీసుల నిర్లక్ష్యంతోనే సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద తొక్కిసలాట చోటుచేసుకుందని కామెంట్ చేశారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతిచెందడం బాధకరమని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry) ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) మీద పోలీసులు కేసు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టడం సరి కాదని అన్నారు. అసెంబ్లీ (Assembly)లో కూడా అల్లు అర్జున్ గురించి ఘోరంగా మాట్లాడారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ప్రముఖులంతా మళ్లీ చెన్నై (Chennai) లేదా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు వెళ్లాలని చర్చించుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.      

Tags:    

Similar News