ఆ ఉద్యోగులకు BIG షాక్.. ఉగాది సెలవులు రద్దు
ఉగాది పండుగపూట(Ugadi Festival) సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులకు(Sub-Registrar Employees) ప్రభుత్వం భారీ షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది పండుగపూట(Ugadi Festival) సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులకు(Sub-Registrar Employees) ప్రభుత్వం భారీ షాకిచ్చింది. రేపు(ఆదివారం), ఎల్లుండి(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ(Stamps and Registration Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్ఎస్ ఫీజు(LRS Fee) మార్చి 31వ తేదీలోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ(Registration Department) ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మార్చి 30, 31వ తేదీలు సెలవు దినాలు కావడంతో చెల్లింపులు జరుపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.
మరోవైపు.. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇస్తోంది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది.