రంజాన్ వేళ తెలంగాణ ముస్లిం యువతకు మంత్రి కీలక సూచన
మైనార్టీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని, ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారు సద్వినియోగం

దిశ, వెబ్‌డెస్క్: మైనార్టీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని, ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అటవీ పర్యావరణం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. రంజాన్ పండుగను(Ramadan Festival) పురస్కరించుకొని వరంగల్ ఎల్బీనగర్ లోని ఏ వన్ క్లాసిక్ కన్వెన్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాల్గొన్నారు.

ఉపవాస దీక్షలతో ఉన్న ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదరా భావంతో ఉండాలని చెప్పారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లిం సోదరులను అన్ని రంగాల్లో రాణించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని, ముఖ్యంగా పలు రంగంలో ప్రతిభ చాటిన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముస్లిం మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, ప్రభుత్వం కలిపిస్తున్న అవకాశాలను అన్ని వర్గాల ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదని, నెలరోజులపాటు ఉపవాస దీక్షలు చేయడం చెప్పుకోదగ్గ విషయమని అన్నారు.