ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం వేళ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2025-03-29 14:44 GMT
ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం వేళ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ (Ugadi Festival) సందర్భంగా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు (Wishes) తెలిపిన కేసీఆర్.. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు (Changes) రావాలని కోరుకున్నారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను (Mother Nature) ప్రార్థించారు. అలాగే రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా (Agriculture Year) ఉగాది నిలుస్తుందని కేసీఆర్ అన్నారు.

ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని తెలిపారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని అన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కేసీఆర్ కోరుకున్నారు. రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆశించారు.

అప్పుడే విశ్వావసు నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని అన్నారు. ఇక ఉగాది పచ్చడి మాదిరి, జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నానని మాజీ సీఎం అన్నారు.

Tags:    

Similar News