Ponnala Lakshmaiah: లగచర్లను రేవంత్‌ లంకలా మార్చారు.. మాజీ మంత్రి పొన్నాల కీలక వ్యాఖ్యలు

Update: 2024-12-22 06:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంతంగా ఉన్న లగచర్ల (Lagacharla)ను ఫార్మా కంపెనీ (Pharma Companies)ల కోసం భూసేకరణ (Land Acquisition) పేరుతో లంకలా మార్చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Former Minister Ponnala Lakshmaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారనే ఆ గిరిజన రైతులు తిరగబడ్డారని పేర్కొన్నారు. కానీ, అధికారులపై దాడి చేయడం వారి అభిమతం కాదని.. భూ సేకరణను అడ్డుకోవాలని మాత్రమే వారు అలా చూశారని తెలిపారు. కాంగ్రెస్ (Congress) నాయకులకు అప్పులు (Debts), పెట్టుబడుల(Investment)పై ఏ మాత్రం అవగాహన లేదని ఆరోపించారు. అసెంబ్లీ (Assembly) సాక్షిగా ప్రభుత్వ పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొనసాగిస్తుందో లేదో సమాధానం చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) డిమాండ్ చేశారు.  


Similar News