OU JAC : అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ..రాళ్లతో దాడి
హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటి(HOUSE)ని ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు ముట్టడించారు.
దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటి(HOUSE)ని ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు ముట్టడించారు. వారు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు(Attacks him with Stones) రువ్వారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. రేవతి, శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని వారు ఫ్లకార్డ్సుతో నిరసనకు దిగారు.
ఇంటి గేటు ముందు నిరసన నిర్వహించారు. ఆ తర్వాత నిరసన కారుల్లో కొందరు ఒక్కసారిగా అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట సాగింది. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టినట్లుగా సమాచారం. ఓయూ జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ సినిమా దొంగల్లారా.. కాయకష్టం చేసి సంపాదించుకున్న మా డబ్బులు దోచుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని, ఈరోజు ఒక్క డైరెక్టర్ అయినా ఒక్క ప్రొడ్యూసర్ అయినా చనిపోయిన సామాన్యుడి కుటుంబం గురించిమాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. పేద వాళ్ల కోసం ప్రభుత్వం మాట్లాడుతుంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా మీరు సిగ్గు శరం ఉండాలన్నారు.
Read More : CP CV Anand : సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వీడియో బయట పెట్టిన పోలీసులు