MLC Kavitha : తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ : కవిత

తెలంగాణ అస్తిత్వాన్ని(Telangana Existence) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విమర్శించారు.

Update: 2024-12-22 11:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అస్తిత్వాన్ని(Telangana Existence) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విమర్శించారు. ఎన్నారై బీఆర్ఎస్, జాగృతి, వివిధ తెలంగాణ ఎన్నారై సంస్థల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో కవిత మాట్లాడారు. అమ్మ లాంటి తెలంగాణ తల్లిని కాపాడుకుందామని, బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించుకోలేమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు పెద్దపీట వేసుకున్నామని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పాలకులు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన రాజకీయ కక్షతో ఆనవాళ్లు చెరిపిస్తామంటూ తెలంగాణ అస్తిత్వంపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం మరో సాంస్కృతిక పోరాటం తప్పదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరవలేనిదని, ఇదే స్ఫూర్తితో ముందుకెలుదామని కవిత పిలుపునిచ్చారు.

Tags:    

Similar News