MLA Madhusudhan Reddy:సినిమా చూసేందుకు వచ్చి.. ఎందుకు పబ్లిసిటీ?
అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ హీరోగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ హీరోగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్, ఎందుకు పబ్లిసిటీ చేశారు? అంటూ నిలదీశారు. పబ్లిక్ ఎక్కువగా ఉన్నదని తెలిసినా, హడావిడి చేశారన్నారు. ప్రత్యేక్షమైన, పరోక్షంగా జరిగిన.. తప్పిదం జరిగితే మానవత్వంతో ఆదుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. రేవతి చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు.
సినిమా చూసేందుకు వచ్చిన హీరో ఎవరికి కనబడకుండా పబ్లిసిటీ లేకుండా వెళ్లిపోయి ఉంటే బాగుండునని వివరించారు. అభిమానం చూపుతున్నారని విచ్చలవిడిగా రెచ్చిపోయి, రోడ్ షో చేయడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. చేసిన తప్పును సమర్ధించుకోకుండా సరిదిద్దుకుంటే సరిపోయేదన్నారు. పైగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి, మళ్లీ హీరో ఇజం చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేవతి చనిపోయి 11 రోజులు గడుస్తున్నా, కనీసం పరామర్శించ లేదన్నారు. ఓ చిత్ర నటుడుకు ఇలాంటి ఆటిట్యూడ్ సరికాదన్నారు.
Read More...
Shocking incident:స్క్రీన్ మీద ‘పుష్ప-2’ మూవీ.. థియేటర్లో నిందితుడి అరెస్ట్