ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులను దించేసిన రైల్వే సిబ్బంది
ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి..
దిశ, వెబ్ డెస్క్: ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్(Egmore Express) రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. హైదరాబాద్(Hyderabad) నుంచి చెన్నై(Chennnai) వెళ్తుండగా గద్వాల్ రైల్వే స్టేషన్(Gadwal Railway Station)లో రైలు 8 బోగీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. బ్రేక్ డౌన్ అవడం వల్లే పొగలు వచ్చినట్లు గుర్తించారు. మర్మమతులు చేపట్టారు. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళన చెందారు. బోగీ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు. చివరకు రైలు నుంచి దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.