Allu Arjun : అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం

సంధ్య థియేటర్ (Sandhya Theater)తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్(Allu Arjun)వ్యవహారశైలిపై కాంగ్రెస్ వర్గాలు(Congress Cadres)ఫైర్ అవుతున్నాయి.

Update: 2024-12-22 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ (Sandhya Theater)తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్(Allu Arjun)వ్యవహారశైలిపై కాంగ్రెస్ వర్గాలు(Congress Cadres)ఫైర్ అవుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తనపై చేసిన విమర్శలను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి తోసిపుచ్చడంతో కాంగ్రెస్ వర్గాలు బన్నీపై మరింత మండిపడుతున్నాయి. ఇక మాటలను పక్కన పెట్టి అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నాయి. ఓయూ జేఏసీ(OU JAC) ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి పాల్పడి ఇంటిపై రాళ్లు రువ్వి రచ్చ చేశారు.

మరోవైపు అల్లు అర్జున్‌‌ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్(Former Deputy Mayor Baba Fasiuddin), తన అనుచరులతో కలిసి అర్జున్ దిష్టిబొమ్మ(Burning of an effigy)ను దగ్థం చేశారు. ఈ సందర్భంగా ఫసీయుద్ధీన్ మాట్లాడుతూ అల్లు అర్జున్ డ్రామారావు కేటీఆర్ డైరెక్షన్‌లో నటిస్తున్నారని ఆరోపించారు. నిన్న అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందేనని విమర్శించారు. 20ఏండ్లుగా ట్విటర్ పిట్ట కేటీఆర్ గురించి తనకు తెలుసని డైవర్షన్, కన్నింగ్ రాజకీయాలు తనకు తెలుసన్నారు. చనిపోయిన కుటుంబానికి కాకుండా హీరోకు మద్ధతు తెలిపిన ఏకైక నాయకుడు కేటీఆర్ ఒక్కరేనన్నారు. కేటీఆర్‌ను నమ్ముకుంటే అర్జున్ కుటుంబం రోడ్డున పడుతుందని వ్యాఖ్యానించారు. అర్జున్ రీల్ లైఫ్‌లో హీరో.. రియల్ లైఫ్‌లో కాదని మండిపడ్డారు.

Tags:    

Similar News