Railway: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు..
దిశ, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రూట్లలో సిగ్నలింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. విజయవాడ-కాజీపేట మధ్య మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టింది. ఈ మేరకు సికింద్రాబాద్- విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ రైల్వే శాఖ ముఖ్య గమనిక జారీ చేసింది. ఈ నెల 28, 29, జనవరి 2, 5, 7, 8, 9న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాన్ ఇంటర్ పనులు వల్ల కొన్ని ప్రధాన మైన రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రయాణికులు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
గుంటూరు- సికింద్రాబాద్ వయా విజయాడ (12705) ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌తో పాటు సికింద్రాబాద్- గుంటూరు (12706)ను రద్దు చేశారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 28 వరకూ కాచిగూడ-మిర్యాలగూడ(07276), మిర్యాలగూడ-నడికుడి (07277)ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకూ నడికుడి-మిర్యాలగూడ(07973), మిర్యాలగూడ-కాచిగూడ (07974)ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరు-సికింద్రాబాద్- గుంటూరు గోల్కండ ఎక్స్ ప్రెస్ (17201/17202) ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 9 తేదీ వరకూ గుంటూరు నుంచి కాజీపేట వరకూ నడుస్తుందని, తిరిగి కాజీపేట నుంచి గుంటూరు వెళుతుందని తెలిపారు.
దారి మళ్లించిన రైళ్లు
ఈ నెల 26 నుంచి జనవరి 8 వరకు విశాఖ పట్నం- ముంబై ఎల్టీటీ (18519) విజయవాడ నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా వెళ్తుందని అధికారులు స్పష్టం చేశారు.
జనవరి 6 నుంచి 9వ తేదీ వరకూ షాలిమార్-హైదరాబాద్ (18045), జనవరి 7 నుంచి 9 తేదీ వరకూ హైదరాబాద్- షాలిమార్ (18046) నడుస్తాయని చెప్పారు.
వాడి-వికారాబాద్-సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు- విజయవాడ మీదుగా దారి మళ్లించిన రైళ్లు
జనవరి 7న (17205) సాయినగర్ షిర్డీ – కాకినాడ పోర్టు
జనవరి 8న (17206) కాకినాడ పోర్టు – సాయినగర్ షిర్డీ
జనవరి 7న (17208) మచిలీపట్నం – సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్
జనవరి 8న (17207) సాయినగర్ షిర్డీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు (11019) ముంబై సీఎస్‌ఎంటీ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
(11020) భువనేశ్వర్ – ముంబై సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్
విజయవాడ- గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించి రైళ్లు
జనవరి 1, 8 తేదీల్లో (22849) షాలిమార్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్,(20833) విశాఖ – సికింద్రాబాద్ రైళ్లు
గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించి రైళ్లు
జనవరి 7న (12774) సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్‌ప్రెస్