Allu Aravind : బన్నీ ఇంటిపై దాడి సరికాదు : అల్లు అరవింద్
హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిపై నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్(Allu Aravind) స్పందించారు. బన్నీ ఇంటిపై దాడి సరికాదని, దుశ్చర్యలను ప్రేరేపించకూడదని ఆయన అన్నారు. అభిమానులు సంయమనం పాటించాలని, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా అరవింద్ రిక్వెస్ట్ చేశారు.
అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede)లో చనిపోయిన రేవతి(Revathi) కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థి నాయకులు రాళ్ల దాడికి దిగారు. ఫ్లకార్డ్సుతో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు. ఆ తర్వాత నిరసన కారుల్లో కొందరు ఒక్కసారిగా అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read More...
Hyderabad:అల్లు అర్జున్ ఇంటి పై దాడి.. పిల్లలను మామ ఇంటికి తరలింపు