Sandhya Theater : సంధ్య థియేటర్ యాజమాన్యానికి మళ్లీ నోటీసులు ?
సంధ్య థియేటర్ (Sandhya Theater)ఘటనపై పోలీసు(Police)లు మరిన్ని చర్యలకు సిద్దమవుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ (Sandhya Theater)ఘటనపై పోలీసు(Police)లు మరిన్ని చర్యలకు సిద్దమవుతున్నారు. థియేటర్ యాజమాన్యాని(Theater Owners)కి మరోసారి నోటీసులిచ్చేందుకు(Show Cause Notices)పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈనెల 12వ తేదీన థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు చేశారు. పుష్ప-2 ప్రిమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటనలో పోలీసులు 12 లోపాలు గుర్తించారు. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో థియేటర్ యాజమాన్యం విఫలమైందన్నారు.
థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మొగుడంపల్లి రేవతి (35)చనిపోగా, ఆమె 9 ఏళ్ల కుమారుడు తేజ్ చావుబతుకుల మధ్య ఉన్నాడని పోలీసులు గుర్తు చేశారు. థియేటర్‌లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో విఫలమైనందుకు.. ఫారం-బి కింద మంజూరు అయిన సినిమాటోగ్రాఫ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలని.. సంధ్య థియేటర్ లైసెన్స్‌దారు రేణుకా దేవిని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్‌లు 105, 118(1), 3(5) కింద కేసు నమోదు చేశారు. ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని, థియేటర్ సీజ్ చేస్తామని నోటీసులో హెచ్చరించారు. అయినప్పటికి 10 రోజులు గడిచినా యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోనేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.